ప్రతీ రోజు కీరదోస తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Apr 10, 2024

Hindustan Times
Telugu

కీరదోస కాయల్లో కొన్నిరకాల విటమిన్లు, మినలర్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ప్రతీ రోజు కీరదోస తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కలిగే 5 ముఖ్యమైన లాభాలు ఇవే. 

Photo: Unsplash

కీరదోస కాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తింటే శరీరంలో హైడ్రేషన్ బాగా పెరుగుతుంది. డీహైడ్రేషన్‍ను ఇది తగ్గిస్తుంది. అందుకే ముఖ్యంగా వేసవిలో కీరదోసను రోజూ తినాలి. 

Photo: Unsplash

కీరదోసలో ఉండే పోషకాలు చర్మానికి కూడా మంచి చేస్తాయి. చర్మపు మెరుపు, మృధుత్వం పెరిగేందుకు తోడ్పడుతుంది. 

Photo: Unsplash

కీరదోస కాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. 

Photo: Unsplash

పొటాషియమ్ సహా మరిన్ని పోషకాలు ఉండడం వల్ల బ్లడ్ ప్రెజర్ (బీపీ) నియంత్రణలో ఉండేందుకు కూడా కీరదోస ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‍ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. 

Photo: Unsplash

బరువు తగ్గాలనుకుంటున్న వారు కూడా ప్రతీ రోజూ కీరదోస తినడం మంచిది. ఫైబర్, వాటర్ కంటెంట్ సహా మరిన్ని పోషకాలు వెయిట్ లాస్‍కు తోడ్పడతాయి. 

Photo: Unsplash

డైలీ చేసే పనుల్లో ముఖ్యంగా చేసే పని, చేయాల్సిన పని జుట్టును సంరక్షించుకోవడం. మరి దాని కోసం మీరు ఏయే ఆహార పదార్థాలను దూరం పెట్టాలో తెలుసా.. 

Pixabay