రోజూ నాలుగైదు జీడిపప్పులు తింటే ఆరోగ్యంలో రకరకాల మార్పులు వస్తాయి. జీడిపప్పు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jun 02, 2024

Hindustan Times
Telugu

మీ రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. ఇందులో ఒమేగా 3, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందాన్ని పెంచుతుంది.

Unsplash

జీడిపప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

Unsplash

జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు సజావుగా పనిచేస్తుంది.

Unsplash

జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Unsplash

జీడిపప్పులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపుని నింపడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా కారణమవుతాయి.

Unsplash

జీడిపప్పులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను నివారిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Unsplash

కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించని దిశా పటానీ

Instagram