బ్లాక్‍బెర్రీలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు.. మీకు తెలుసా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jun 29, 2024
Hindustan Times Telugu
బ్లాక్‍బెర్రీల్లో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లాక్‍బెర్రీలను రెగ్యులర్‌గా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.
Photo: Pexels
బ్లాక్‍బెర్రీల్లో ఆంథోసియానిన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను బ్లాక్‍బెర్రీలు తగ్గించగలవు.
Photo: Pexels
బ్లాక్‍బెర్రీల్లో విటమిన్ సీ, విటమిన్ కే, మ్యాగ్నిస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియలను మెరుగుపరచగలవు.
Photo: Pexels
బ్లాక్‍బెర్రీలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సాయం చేస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని ఆంథోసియానిన్స్ నెమ్మదింపజేస్తాయి. కీమోథెరపీని కూడా ఈ పండ్లు ప్రభావవంతంగా మార్చగలవు.
Photo: Pexels
బ్లాక్‍బెర్రీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తినొచ్చు. బ్లడ్ షుగర్ లెవెళ్లు నియంత్రణలో ఉండేలా బ్లాక్‍బెర్రీలు సహకరిస్తాయి.
Photo: Pexels
మెదడులో రక్తప్రసరణను బ్లాక్‍బెర్రీలు మెరుగు చేయగలవు. దీంతో మెదడు పనితీరుకు ఇవి మేలు చేస్తాయి.
Photo: Pexels
మీ చిన్నారికి తల్లిపాలు తాగించడానికి ఈ టిప్స్ పాటించండి!