ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ డే(Earth Day 2024) నిర్వహించుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎర్త్ డే జరుపుకుంటున్నాం.
pexels
By Bandaru Satyaprasad Apr 22, 2024
Hindustan Times Telugu
1970లో యూఎస్ కాలిఫోర్నియా తీరంలో భారీగా ఆయిల్ స్పిల్ జరిగి కాలుష్యం ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత యూఎస్ లో ఎర్త్ డే ఉద్యమం ప్రారంభం అయ్యింది.
pexels
1970లో మొదలైన ఈ పర్యవరణ ఉద్యమంలో 192 దేశాలలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. 'ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్' అనే గ్లోబల్ థీమ్‌తో ఈ ఏడాది ఎర్త్ డే నిర్వహిస్తున్నారు.
pixabay
2016లో ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 22ని పారిస్ ఒప్పందానికి తేదీగా ఎంపిక చేసింది. ఈ ఒప్పందం పర్యావరణ ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఒప్పందంగా పరిగణిస్తారు.
pixabay
గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే పారిస్ ఒప్పందాన్ని ఆమోదించడానికి 196 దేశాల నాయకులు 2016 ఏప్రిల్ 22న సమావేశం అయ్యారు.
pixabay
పారిస్ ఒప్పందం ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌ను 2025 నాటికి 1.5°Cకి పరిమితం చేయాలి. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను 2030 నాటికి 43% తగ్గించాలి.
pixabay
ఎర్త్ డే 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్- సమాజంలోని అన్ని వర్గాలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ఉత్పత్తిని 60% తగ్గించడమే ఈ ఏడాది లక్ష్యం.
pexels
2040 నాటికి ప్లాస్టిక్ నిర్మూలించి, రాబోయే తరాలకు ప్లాస్టిక్ రహిత భవిష్యత్తును నిర్మించడమే ఎర్త్ డే అంతిమ లక్ష్యం
pixabay
చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్