మహా కుంభమేళా కు వెళ్లడం సాధ్యం కాకపోతే ఈ పరిహారాలు ఇంట్లోనే చేసి పుణ్యస్నానాలు ఆచరించండి

Pic Credit: Shutterstock

By HT Telugu Desk
Jan 13, 2025

Hindustan Times
Telugu

మహా కుంభమేళా 2025 ప్రారంభమైంది. పుష్య పూర్ణిమ నాడు మొదటి రాజ స్నానం ప్రయాగ్ రాజ్ లో చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

Pic Credit: Shutterstock

రాజస్నానం

కొన్ని కారణాల వల్ల మహాకుంభమేళాకు రాలేక రాజస్నానం చేయలేని వారు ఇంట్లోనే కొన్ని  పరిహారాలు చేయడం ద్వారా మహాకుంభ పుణ్యాన్ని పొందవచ్చు.

సూర్యోదయానికి ముందే రాజస్నానం చేస్తారని మత గ్రంథాలు చెబుతున్నాయి.  ఉదయాన్నే నిద్రలేచి, మీకు సమీపంలో ఉన్న పవిత్ర నది లేదా సరస్సులో స్నానం చేయండి

నదీస్నానం

Pic Credit: Shutterstock

గంగా నీరు కలపండి

సమీపంలో పవిత్ర నది లేకపోతే, మీరు ఇంట్లో స్నానపు నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేయాలి. ఈ సమయంలో, హర్ హర్ గంగే జపించండి.

Pic Credit: Shutterstock

మంత్రాన్ని జపించడం

స్నానం చేసేటప్పుడు గంగమ్మ తల్లిని ధ్యానించి ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి.

Pic Credit: Shutterstock

కుంభమేళాలో ఐదుసార్లు స్నానం చేయాలనే నియమం ఉంది. మీరు సమీప నదిలో స్నానాకి వెళితే 5 మునకలు వేయండి.

5 మునకలు

Pic Credit: Shutterstock

స్నానం చేసిన వెంటనే శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. అనంతరం తులసి అమ్మవారికి నీళ్లు సమర్పించాలి.

సూర్యభగవానుడు, తులసి మాతకు నీరు

Pic Credit: Shutterstock

సూర్యభగవానుడికి, తులసి మాతకు నీరు సమర్పించిన తర్వాత ఇంట్లోని పూజా స్థలంలో కూర్చోవాలి. శ్రీ హరి విష్ణువు, శివుడు, ఇతర దేవతలను పూజించండి

భగవంతుని ధ్యానించండి.

మహాకుంభమేళా సమయంలో  పేదలు లేదా అవసరమైన వారికి ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయండి.

అవసరమైన వారికి విరాళం ఇవ్వండి

మహాకుంభమేళా అనేది ఆత్మశుద్ధి, ఆత్మపరిశీలన పండుగ. రాజస్నానం రోజున రోజంతా ఇంట్లోనే ఉపవాసం ఉండి సాత్విక ఆహారాన్ని తినాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో కూర్చొని పుణ్యాన్ని పొందవచ్చు.

ఉపవాసం పాటించండి

ఒక్క లైన్​లో జీవిత పాఠాలు నేర్పించే త్రివిక్రమ్​ శ్రీనివాస్​ ఫేమస్​ డైలాగ్స్​​ ఇవి..

wiki