జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay

By Ramya Sri Marka
Dec 05, 2024

Hindustan Times
Telugu

మేష రాశి (Aries) : ఈ రాశి వారికి ఎరుపు రంగు బాగా కలిసివస్తుంది. ఈ రంగు శక్తిని, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

pixabay

వృషభ రాశి (Taurus) : ఈ రాశి వారికి పసుపు లేదా నారింజ రంగు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది శాంతిని, ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తుంది.

pixabay

మిథున రాశి (Gemini):ఈ రాశి వారికి పసుపుపచ్చ లేదా కుంకుమ రంగులు మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇవి మానసిక స్థిరత్వం, సృజనాత్మకతను పెంచుతాయి.

pixabay

కర్కాటక రాశి (Cancer): ఈ రాశి వారికి తెలుపు, పసుపు రంగులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి శాంతిని, కుటుంబంలో సుఖసంతోషాలను పెంచుతాయి.

pixabay

సింహ రాశి (Leo): ఈ రాశి వారికి పసుపు, బంగారు రంగులు ప్రత్యేకంగా కలిసొస్తాయి. ఇవి ధనవృద్ధి, శక్తిని పెంచుతాయి.

pixabay

కన్య రాశి (Virgo): ఈ రాశి వారికి నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలంగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక శాంతిని, మానసిక శక్తిని పెంచుతాయి.

pixabay

తులా రాశి (Libra): ఈ రాశి వారికి గులాబీ, రుపు రంగులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి ప్రేమ, శాంతి, సమతుల్యతను ప్రోత్సహిస్తాయి.

pixabay

వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారికి నలుపు,  ఎరుపు రంగులు అనుకూలంగా ఉంటాయి. ఇవి శక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనుకూల మార్పులను తీసుకువస్తాయి.

pixabay

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారికి నీలం, పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి. ఇవి మనస్సుకు శాంతిని తెచ్చిపెట్టేవి. ధనసమృద్ధిని ఆకర్షించే రంగులు.

pixabay

మకర రాశి (Capricorn): ఈ రాశి వారికి గ్రే కలర్, కాఫీ రంగు అనుకూలంగా ఉంటాయి. ఈ రంగులు శక్తి, మానసిక స్థిరత్వం,  ప్రగతిని సూచిస్తాయి.

pixabay

కుంభ రాశి (Aquarius): ఈ రాశి వారికి నీలం,  ఆకుపచ్చ రంగులు సరిపోతాయి. ఇవి సృజనాత్మకత, మానసిక శక్తిని పెంచుతాయి,  శాంతి ఇస్తాయి.

pixabay

మీన రాశి (Pisces): ఈ రాశి వారికి ఆకుపచ్చ, సముద్ర నీలం, గులాబీ రంగులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి ప్రేమ, శాంతి, సానుకూల మార్పులను ఆకర్షిస్తాయి.

pixabay

ప్రతి రాశి వారు వారి స్వభావానికి, జీవన శైలికి, మానసిక స్థితికి అనుగుణంగా రంగులను ఎంచుకోవడం ద్వారా జీవితంలో శుభఫలితాలు సాధించవచ్చు.

pixabay

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels