వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా గంటలు కంప్యూటర్ స్క్రీన్ చూస్తుంటారు. గంటల పాటు స్మార్ట్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. దీంతో కళ్లు పొడిబారి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యకు ఇంటి చిట్కాలు సహాయపడతాయి.   

pexels

By Bandaru Satyaprasad
Jun 02, 2024

Hindustan Times
Telugu

పొడి కళ్లు అంటే - కన్నీళ్లు ఉత్పత్తి తగినంతగా లేనప్పుడు లేదా కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయినప్పుడు కళ్లు పొడిబారతాయి. దీని వల్ల అసౌకర్యం, దృష్టి సమస్యలకు దారితీస్తుంది.   

కళ్లు పొడిబారడానికి సంకేతాలు- కళ్లు మండడం, చికాకు, కళ్లు ఎరుపు, అసౌకర్యం, అస్పష్టమైన దృష్టి, వెలుగును చూడలేకపోవడం, కాంటాక్ట్ లెన్సులు ధరించడంలో ఇబ్బందులు, డిజిటల్ స్క్రీన్లు చూసినప్పుడు ఇబ్బంది  

pexels

పొడిబారిన కళ్లకు  ఆముద నూనె సహాజ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఆముదం కలిగిన ఐ డ్రాప్స్ పొడి కంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.   

వెచ్చని కంప్రెసెస్- కన్నీళ్లలో ఆయిల్, నీరు, శ్లేష్మం ఉంటాయి. మీ కళ్లు తేమగా, ఆరోగ్యంగా ఉండటానికి శుభ్రమైన వాష్‌క్లాత్‌ను గోరువెచ్చని నీటితో తడిపి, కంటిపై ఒక నిమిషం పాటు ఉంచండి. మీ వేలితో కనురెప్ప అంచుని సున్నితంగా నొక్కండి. దీంతో కన్నీళ్లు రాకుండా అడ్డుపడే నూనెలను బయటకు వదులుతుంది. ఇలా తరచుగా చేయండి.   

pexels

కనురెప్పలను శుభ్రం చేసుకోవడం-  మీ కనురెప్పలను, కన్ను చుట్టుపక్కల చర్మం శుభ్రపరచడం వల్ల మంట తగ్గుతుంది. కొద్దిగా బేబీ షాంపూ లేదా తేలికపాటి సబ్బును మీ కనురెప్పల బేస్ దగ్గర సున్నితంగా మసాజ్ చేయండి. 

pexels

కను రెప్పలు ఎక్కువగా బ్లింక్ చేయండి- కంప్యూటర్లు, ల్యాప్ టాప్, ఫోన్లు ఎక్కువగా చూసే వాళ్లు తీక్షణంగా చూడడం వల్ల కనురెప్పలు తక్కువగా కొడుతుంటారు. ఇందుకు మీరు 20/20 నియమాన్ని అనుసరించండి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు మీ కళ్లు మూసుకోండి. 

pexels

చేపలు తినండి - సాల్మన్, ట్యూనా,  సార్డినెస్, ట్రౌట్ , మాకేరెల్ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు మీ కంటిలో నూనెను తయారు చేసే గ్రంథులు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.   

pexels

 హైడ్రేటెడ్ గా ఉండండి- మీ కళ్లతో సహా ఆరోగ్యంగా ఉండటానికి మీ శరీరానికి తగినంత నీరు అవసరం. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. రోజులో 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి.  

pexels

గ్లేర్, సన్ గ్లాసెస్-  వేగవంతమైన గాలులకు కన్నీళ్లు త్వరగా ఆవిరైపోతాయి. హెయిర్ డ్రైయర్, ఎయిర్ కండీషనర్ లేదా ఫ్యాన్ నుంచి గాలి నేరుగా కంటి వైపు వీచకుండా చూసుకోండి. యాంటీ గ్లేర్, సన్ గ్లాసెస్ కళ్లు పొడిబారకుండా సహాయపడతాయి.  

pexels

 ఐ డ్రాప్స్ - కళ్లు పొడిబారకుండా సహాయపడేందుకు అనేక బ్రాండ్ల ఐ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు వాటిని వాడవచ్చు.   

pexels

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels