బరువు తగ్గేందుకు ఉపకరించే 5 రకాల కూరగాయల జ్యూస్‍లు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 12, 2024

Hindustan Times
Telugu

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కూరగాయల జ్యూస్‍లు ఇందుకు ఉపయోగపడతాయి. వెయిట్ లాస్‍కు ఉపకరించే 5 రకాల కూరగాయల జ్యూస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

క్యారెట్‍లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, కెరొటెనోయిడ్స్ అధికంగా ఉంటాయి. అందుకే క్యారెట్ జ్యూస్ తాగితే జీర్ణక్రియ మెరుగవడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఇలా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

కీరదోస కాయ జ్యూస్‍లో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

Photo: Pexels

బీట్‍రూట్ జ్యూస్‍లో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అతిగా ఆహారం తినకుండా చేస్తుంది. దీనివల్ బరువు తగ్గేందుకు ఈ జ్యూస్ తోడ్పడుతుంది.

Photo: Pexels

పాలకూర, కేల్, క్యాబేజ్‍లతో తయారు చేసిన జ్యూస్‍ల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారు ఈ జ్యూస్‍లను తాగితే చాలా మేలు జరుగుతుంది.

Photo: Pexels

కలబంద జ్యూస్ తాగడం వల్ల జీవక్రియలు మెరుగవుతాయి. అలాగే శరీరంలోని చెడు కొవ్వు కరగడంలో కూడా సహాయపడుతుంది. ఇలా ఈ జ్యూస్ వెయిట్ లాస్‍కు ఉపయోగపడుతుంది.

Photo: Pexels

వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి

Photo: Pexels