తులసిని భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. శ్వాసకోస సమస్యలు, జీర్ణ సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో తులసి వాడతారు. రోజూ తులసి నీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  

Freepik

By Bandaru Satyaprasad
Jun 16, 2024

Hindustan Times
Telugu

రోగ నిరోధక శక్తి - తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తులసి శరీర రక్షణ విధానాలను బలోపేతం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు అరికట్టడంతో సహాయపడుతుంది.  

freepik

ఒత్తిడి, ఆందోళన దూరం - తులసి అడాప్టోజెన్ గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది.  

freepik

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది - తులసి జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ క్రియకు సహాయపడుతుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.  

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది - తులసి జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ క్రియకు సహాయపడుతుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.  

freepik

శ్వాసకోశ ఆరోగ్యం - తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాస కోశ వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి.  

freepik

చర్మ ఆరోగ్యానికి - తులసిలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు, చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  

pexels

బ్లడ్ షుగర్ నియంత్రణ - తులసి శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. షుగర్ ఉన్న వారికి తులసి నీరు ప్రయోజనకరంగా ఉంటుంది.  

freepik

 డీటాక్సిఫై - తులసి నీటిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ కాలేయం, కిడ్నీలను డీటాక్స్ చేస్తుంది. 

freepik

 గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది - తులసి నీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

pexels

హనుమంతుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే

pixabay