ఉదయాన్నే తులసి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jun 17, 2024

Hindustan Times
Telugu

తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ తులసి ఆకులతో టీ చేసుకొని రెగ్యులర్‌గా ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.  

Photo: Unsplash

తులసి టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యం బారిన పడే రిస్క్‌ను తులసి తగ్గించగలదు. 

Photo: Unsplash

తులసి టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. ఉదర ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది.  

Photo: Unsplash

బ్లడ్ షుగర్ లెవెళ్లు నియంత్రణలో ఉండేందుకు కూడా తులసి టీ ఉపయోగపడుతుంది. పొటాషియం ఉండడం వల్ల బ్రడ్ ప్రెజర్‌ను కూడా కంట్రోల్‍లో ఉంచగలదు. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

Photo: Unsplash

జలుబు, దగ్గు నుంచి తులసి టీ ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది. 

Photo: Unsplash

తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందుకే ఈ టీ తాగితే చర్మానికి కూడా మేలు జరుగుతుంది. మొటిమలు తగ్గే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు కూడా తులసి టీ ఉపయోగపడుతుంది. 

Photo: Unsplash

తులసి టీ చేసుకునేందుకు.. ముందుగా రెండు గ్లాసుల నీరు మరిగించుకోవాలి. అందులో నాలుగైదు తులసి ఆకులు వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ టీని వడగట్టుకోవాలి. రుచికోసం నిమ్మరసం, తగినంత తేనె వేసుకోవచ్చు.  

Photo: Unsplash

బ్లాక్ డ్రెస్‍లో బిగ్‍బాస్ భామ హాట్ షో: ఫొటోలు

Photo: Instagram