గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని మీరు వినే ఉంటారు. కానీ ఉప్పు నీరు తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా? బరువు తగ్గడం నుంచి చర్మ ఆరోగ్యం వరకు...ఉప్పు నీటితో కలిగే 9 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Mar 24, 2025

Hindustan Times
Telugu

మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది - సాల్ట్ వాటర్ మీ శరీరం ఎక్కువ సేపు తేమను నిలుపుకునేలా చేస్తుంది. ఎక్కువ సేపు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా తీవ్రమైన వ్యాయామం తర్వాత లేదా వేసవి రోజుల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.  

pexels

ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ - ఉప్పులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది మీ శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది.  

 పేగు ఆరోగ్యం -ఉప్పు నీరు భేది మందుగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరుపేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.  

pexels

మీ శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది - ఉప్పు నీరు డీటాక్సిఫికేషన్ లక్షణాలు కలిగి ఉంటుంది. మీ శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలను ప్రేరేపించి, వ్యర్థాల వడపోతను ప్రోత్సహిస్తుంది.  

pexels

చర్మ సంరక్షణకు - ఉప్పు నీరు రక్త ప్రసరణకు ప్రోత్సహిస్తుంది. దీంతో మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. ఉప్పునీరు తాగడంతోపాటు ఈ నీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, మెరుపు రావడానికి సహాయపడుతుంది. మొటిమల లక్షణాలను తగ్గిస్తుంది.  

pexels

బరువు తగ్గడానికి - నేరుగా కాకపోయినా...ఉప్పునీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి దోహదం చేస్తుంది.  

pexels

శ్వాసకోశ సమస్యల నివారణ - ఉప్పు నీరు మీ శ్వాసకోశ వ్యవస్థ నుంచి శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఉబ్బసం లేదా అలెర్జీల వంటి పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసను మెరుగుపరుస్తుంది.  

pexels

గొంతు నొప్పిని తగ్గిస్తుంది - సాల్ట్ వాటర్ గొంతు నొప్పి ఉపశమన లక్షణాలకు ప్రసిద్ధి. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కలించడం వల్ల మంట తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గుతుంది.  

pexels

ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది - ఉప్పులోని మినరల్స్ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మనసుకు ప్రశాంతత కలిగించి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా మేరకు సాల్ట్ వాటర్ వినియోగించడం ముఖ్యం.  

pexels

గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు

Image Source From unsplash