పరగడుపున ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ రోజును హెల్తీగా ప్రారంభించవచ్చు.  

freepik

By Bandaru Satyaprasad
Jan 25, 2025

Hindustan Times
Telugu

బెల్లం నీరు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.   

freepik

డీటాక్సిఫికేషన్- బెల్లంలోని పొటాషియం టాక్సిన్స్, అదనపు ఫ్లూయిడ్స్ ను బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. 

pexels

బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. ఉదయాన్నే బెల్లం నీరు తాగితే శరీర శక్తి పెరుగుతుంది.  

pexels

బెల్లంలోని వెచ్చని లక్షణాలు గొంతుకు ఉపశమనం కల్పిస్తాయి. దగ్గు, కంజెషన్,ఉబ్బసం, బ్రోన్కైటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.    

pexels

బెల్లం నీరు జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.   

pexels

బెల్లంలోని ఐరన్ కంటెంట్ రుతు తిమ్మిరి, ఉబ్బరం, మూడ్ స్వింగ్‌లను తగ్గిస్తుంది. 

pexels

మీరు 1-2 టీస్పూన్ల బెల్లం పొడి లేదా ఒక చిన్న ముక్కను వెచ్చని నీటిలో కలపాలి. బెల్లం నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.   

pexels

మఖానా తినేందుకు 5 రుచికరమైన మార్గాలు ఇవే

Image Credits: Adobe Stock