హలో గురూ.. రాత్రిపూట బీర్ తాగుతున్నారా.. బీ కేర్ ఫుల్!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 29, 2024

Hindustan Times
Telugu

బీర్‌లోని ఆల్కహాల్ మొదట నిద్ర వచ్చేలా చేస్తుంది. కానీ రాత్రి మధ్యలో నిద్ర లేవడానికి కారణమవుతుంది. నిద్రలేమికి దారితీస్తుంది.

Image Source From unsplash

రాత్రి భోజనం తర్వాత బీర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మంట, అజీర్ణం వంటి సమస్యలను పెంచుతుంది.

Image Source From unsplash

ఆల్కహాల్ మూత్రవిసర్జనను పెంచుతుంది, దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. తలనొప్పి, వాంతులు, తీవ్రమైన దాహం వంటి లక్షణాలకు దారితీస్తుంది.

Image Source From unsplash

రాత్రి తాగడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో కాలేయ వ్యాధికి దారితీస్తుంది.

Image Source From unsplash

ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది. గుండె కండరాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source From unsplash

ఆల్కహాల్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఆందోళన, నిరాశ, మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.

Image Source From unsplash

బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి తాగడం వల్ల బరువు పెరుగుదల, ఊబకాయానికి దారితీస్తుంది.

Image Source From unsplash

ఆల్కహాల్ రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source From unsplash

అధికంగా తాగడం వల్ల కుటుంబం, ఉద్యోగం, సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Image Source From unsplash

ప‌చ్చి బొప్పాయి తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash