యవ్వనంగా కనిపించడానికి నీటిని ఈ 4 విధాలుగా తీసుకోండి

By Hari Prasad S
May 20, 2025

Hindustan Times
Telugu

నీళ్లు శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీళ్లు తాగుతాం. అయితే ఈ నీటిని సరైన విధానంలో తాగితే యవ్వనంగా కూడా ఉంటామని మీకు తెలుసా?

నీళ్లు తాగడమే కాదు.. దానిని ఓ పద్ధతి ప్రకారం తీసుకుంటే మీరు 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల వారిలా కనబడతారు.

ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాసులో గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. రాత్రంతా శరీరం డిటాక్స్ మోడ్‌లో ఉంటుంది. ఒంట్లో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడానికి నీళ్లు చాలా అవసరం. నెమ్మదిగా నీరు తాగడం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని రోజుకు ఒక్కసారైనా తాగాలి. రాగి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది

నీటిలో పుదీనా, నిమ్మకాయ, దోసకాయ లేదా కొన్ని బెర్రీ ముక్కలను కలిపి 'డిటాక్స్ వాటర్' తయారు చేయండి. ఈ నీటిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మీ ముఖం కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడతాయి.

నీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రోజంతా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చాలా చల్లని లేదా వేడి నీరు చర్మానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత నీరు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. తిన్న వెంటనే నీళ్లు తాగకండి. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇక కడుపు ఉబ్బరం వల్ల చర్మం మెరుపు కూడా తగ్గుతుంది.

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash