కొవ్వు తగ్గేందుకు రెగ్యులర్‌గా ఇది తాగండి.. ఎలా చేసుకోవాలంటే!

Photo: Pixabay

By Chatakonda Krishna Prakash
Jan 05, 2025

Hindustan Times
Telugu

శరీరంలోని కొవ్వు కరగాలంటే తీసుకునే ఫుడ్స్, సేవించే డ్రింక్స్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పక్కా డైట్ పాటించాలి. కొన్ని రకాల టీలు.. ఫ్యాట్‍ బర్న్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

బాడీలో పేరుకుపోయిన కొవ్వును అల్లం, పసుపుతో చేసే టీ కరిగించగలదు. రెగ్యులర్‌గా ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. 

Photo: Pixabay

శరీరంలో జీవక్రియను అల్లం పసుపు టీ పెంచుతుంది. దీంతో కొవ్వు కరిగేందుకు సహకరిస్తుంది. శరీరవాపును కూడా ఇది తగ్గించగలదు. 

Photo: Pixabay

అల్లంలోని జింగరోల్, పసుపులోని కర్కుమిన్.. శరీరంలోని ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు తోడ్పడతాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గేలా చేయగలవు.

Photo: Pexels

అల్లం పసుపు టీ చేసుకునేందుకు ఓ కప్ నీరు, ఓ ఇంచ్ అల్లం ముక్క, ఓ టీస్పూన్ పసుపు అవసరం అవుతాయి. 

Photo: Pixabay

ముందుగా ఓ కప్ నీటిని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో అల్లం ముక్క, పసుపు వేయాలి. వాటిని సుమారు 15 నిమిషాల సన్నని మంటపై మరిగించాలి. మరిగిన తర్వాత వడబోస్తే అల్లం పసుపు టీ సిద్ధమవుతుంది. రుచి కోసం సరిపడా తేనె వేసుకోవాలి. కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు. 

Photo: Pexels

ఈ అల్లం పసుపు టీ రెగ్యులర్‌గా తాగడం వల్ల కొవ్వు కరగడమే కాకుండా మరిన్ని లాభాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి మెరుగువతుంది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గేందుకు కూడా ఈ టీ ఉపయోగపడుతుంది. 

Photo: Pixabay

శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేసే 5 రకాల ఫుడ్స్

Photo: Pexels