మీ రోజును పోషకాలతో స్టార్ట్ చేయాలనుకుంటే...ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం కంటే మెరుగైనది మరొకటి ఉండదు. బలమైన రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Aug 31, 2024
Hindustan Times Telugu
తులసి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ఆయిల్స్ ఉంటాయి. ఇవి సాధారణ జలుబు, అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ఖాళీ కడుపుతో రోజూ ఓ గ్లాస్ తులసి నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి మరింత పెరుగుతుంది.
pixabay
తులసిని అడాప్టోజెన్ అని పిలుస్తారు. ఇది ఒత్తిడి స్థాయిలను నిర్వహిస్తుంది, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఒత్తిడి సమయాల్లో విడుదలయ్యే హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించి మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తోంది.
pexels
తులసి నీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
unsplash
తులసి నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై మొటిమలను తగ్గిస్తాయి, చర్మాన్ని తేమ ఉంచి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.
pixabay
తులసి నీరు బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను నమిలితే మంచిది.
pixabay
తులసి నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మీ ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.
pixabay
తులసిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది. శ్వాసక్రియలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి తులసి నీరు బెస్ట్ నాచురల్ రెమెడీ.
pixabay
తులసిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటిలోని బాక్టీరియాను తగ్గిస్తుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గించి ఓరల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టుకునేందుకు తులసి నీటిని పుక్కలించవచ్చు.
pixabay
తులసి శరీర బరువు నిర్వహణలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ను బర్న్ చేసి బరువు నిర్వహణకు సాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపి, స్టామినాను పెంచడంలో సహాయపడుతుంది.