ఉదయాన్నే ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకున్నారంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుకు గుడ్‌బై చెప్పచ్చు, అధిక బరువు సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు. అవేంటో చూద్దాం
pixa bay
By Ramya Sri Marka Feb 01, 2025
Hindustan Times Telugu
నిమ్మరసం:
ఉదయాన్నే నిమ్మరసం తాగడం వలల్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.
Pexels
దాల్చినచెక్క నీరు:
రోజూ ఉదయం వెచ్చని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కు కొద్ది రోజుల్లోనే గుడ్ బై చెప్పచ్చు
Pexels
జీరా వాటర్:
వెచ్చని నీటిలో జీలకర్రను వేసి కాసేపు మరిగించి, చల్లారిన తర్వా వడకట్టి తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.
Pexels
పసుపు నీరు:
పసుపు నీరు తాగడం వల్ల పొట్ట కొవ్వు తగ్గి బరువు పెరిగే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు నమ్ముతారు.
pexels
గ్రీన్ టీ:
క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొంవవచ్చు.
Pexels
అలోవెరా జ్యూస్:
అలోవేరా రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, బరువు తగ్గడానికి కూడ చాలా బాగా సహాయపడుతుంది.
Pexels
గోరు వెచ్చటి నీరు:
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడంతో పాటు జీవక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గే అవకాశం ఉంది.
Pexels
నానబెట్టిన జీలకర్ర నీరు:
రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
Pexels
ప్రేమికుల రోజు వస్తోంది.. మీ లవర్‌కు ఇలాంటి గిప్ట్ ప్లాన్ చేయండి.. జీవితంలో మర్చిపోరు!