మీ శరీరాన్ని ఇలా డిటాక్స్ చేయండి

పడుకునే ముందు డిటాక్స్ కోసం 5 డ్రింక్స్

By Hari Prasad S
May 22, 2025

Hindustan Times
Telugu

పడుకునే ముందు డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల జీర్ణక్రియ, కడుపు ఉబ్బరం, జీవక్రియకు సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు తీసుకోవలసిన 5 డిటాక్స్ డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయి

PEXELS

చామంతి టీ

చామంతి టీ ఒక తేలికపాటి టీ. ఇది రిలాక్స్ అయ్యేలా చేయడమే కాకుండా కడుపుకు ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా పడుకోవడానికి ముందు తాగడం మంచిది.

PEXELS

తేనె-నిమ్మకాయ నీరు

నిమ్మకాయలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరం సహజ డిటాక్స్ ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది. దీనికి కాస్త తేనె జోడిస్తే రోగనిరోధక శక్తిని పెంచి, కాస్త తీపిని జోడిస్తుంది.

PINTEREST

పసుపు పాలు

పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. 

PEXELS

మెంతుల నీళ్లు

మెంతులు కలిపిన నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది

PEXELS

అల్లం టీ

అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది

PEXELS

ఈ ఐదు డ్రింక్స్‌లో ప్రతి రోజు ఏదో ఒకదానిని రాత్రి పడుకునే ముందు తాగితే శరీరంలో మలినాలు తొలగిపోవడంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి

pexels

రుహానీ శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు.. బ్లూ బ్రాలో హాట్ హాట్ సోయగాలు