మామిడి పండ్ల జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 02, 2024

Hindustan Times
Telugu

వేసవిలో దొరికే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతీ రోజూ మామిడి పండ్ల జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

మామిడి పండ్లలో విటమిన్ సీ, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. 

Photo: Pexels

ప్రతీరోజూ మామిడి పండ్ల రసం తీసుకోవడం వల్ల చర్మ కణాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో చర్మం మెరుపు పెరగడంతో పాటు మేలు జరుగుతుంది. 

Photo: Pexels

మామిడిలో ఫైబర్, డైజెస్టివ్ ఎంజైమ్‍లు ఉంటాయి. దీంతో ఈ పండు జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

మామిడి పండ్లలో సరిపడా క్యాలరీలు, నేచురల్ షుగర్ ఉంటుంది. దీంతో మామిడి పండు జ్యూస్ తాగితే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. 

Photo: Pexels

మామిడి పండ్లలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఈ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు బీపీని నియంత్రించడంలోనూ ఉపకరిస్తుంది. 

Photo: Pexels

'మోదీ కి గ్యారెంటీ'- బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో హైలైట్స్​..

ANI