రోజూ ఉదయాన్నే కరివేపాకు టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకు టీ తాగాలి.
Unsplash
By Anand Sai Aug 18, 2024
Hindustan Times Telugu
కరివేపాకులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
Unsplash
కరివేపాకు టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనతతో బాధపడేవారు రోజూ తాగడం మంచిది.
Unsplash
కరివేపాకులోని పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి. రోజూ ఉదయాన్నే ఈ టీ తాగడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది.
Unsplash
కరివేపాకుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను నయం చేస్తుంది.
Unsplash
కరివేపాకు టీ చేయడానికి కొన్ని కరివేపాకులను తీసుకోండి. వాటిని బాగా కడగాలి.
Unsplash
ఒక పాత్రలో కప్పు నీరు పోసి మరిగించాలి. నీరు మరగడం ప్రారంభించినప్పుడు, స్విచ్ ఆఫ్ చేసి, కరివేపాకు జోడించండి. కాసేపు మూత పెట్టి ఉంచితే కొద్ది నిమిషాల్లోనే నీళ్ల రంగు మారిపోతుంది.
Unsplash
టీని ఒక కప్పులో వడకట్టండి. రుచికరమైన టీ సిద్ధంగా ఉంటుంది. మీరు తియ్యగా కావాలనుకుంటే అవసరమైనంత చక్కెర జోడించండి.