గంజి రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల చాలా వరకు వ్యాధులకు ఇది సహజ ఔషధంగా చెప్పొచ్చు

freepik

By Hari Prasad S
Feb 19, 2025

Hindustan Times
Telugu

గంజిలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది వెంటనే శక్తిని ఇస్తుంది. అలసటగా ఉన్నప్పుడో లేక వ్యాయామం తర్వాత గంజి తాగడం మంచిది.

freepik

గంజి వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రోజూ గంజి తాగడం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది

freepik

గంజిలోని పోషకాల వల్ల రోజంతా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎండాకాలంలోగానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడుగానీ గంజి కచ్చితంగా తాగాలి

freepik

గంజిలో బీ1, బీ2, బీ6లాంటి విటమిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియకు, మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యమైనవి. మెగ్నీషియం, పొటాషియంలాంటి మినరల్స్ కూడా ఉంటాయి.

pexels

చర్మ ఆరోగ్యానికి గంజి ఎంతో మేలు చేస్తుంది. గంజి తాగినా, చర్మానికి రాసుకున్నా మొటిమలు, ర్యాషెస్ లాంటివి తగ్గిపోతాయి

freepik

గంజిలోని పొటాషియం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

freepik

గంజిలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సమయంలో గంజి తాగడం ఎంతో మంచిది

freepik

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels