లవంగాల టీ తాగితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఎలా చేసుకోవాలంటే..
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jun 03, 2024
Hindustan Times Telugu
లవంగాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. లవంగాలతో టీ చేసుకొని రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
లవంగాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే లవంగాల టీ తాగితే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. దీర్ఘకాల వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతుంది. చాలా రోగాలను నిరోధించేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
లవంగాల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపులో మంట ఉంటే కూడా తగ్గేందుకు సహకరిస్తుంది. ఆహారం తిన్నాక ఈ టీ తాగితే జీర్ణం బాగా అవుతుంది.
Photo: Pexels
లవంగాల టీ తాగితే నోటి ఆరోగ్యం బాగుంటుంది. దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది. ఇన్‍ఫెక్షన్లను కూడా తగ్గుతాయి. నోట్లో బ్యాక్టీరియాను ఈ టీ తొలగించలదు.
Photo: Pexels
లవంగాల టీ తాగడం వల్ల దగ్గు, జబులు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి పోయేందుకు కూడా తోడ్పడుతుంది.
Photo: Pexels
రెగ్యులర్‌గా లవంగాల టీ తాగితే కీళ్ల నొప్పులు కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాల అర్థరైటిస్ నుంచి కాస్త ఉపశమనం కలిగించగదు.
Photo: Pexels
లవంగాల టీ చేసుకునేందుకు.. ముందుగా ఓ పాత్రలో రెండు కప్‍ల నీరు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో ఓ టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి. సుమారు 10 నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ టీని వడగట్టుకోవాలి. ఆ టీలో సరిపడా తేనె కలుపుకొని తాగొచ్చు. కావాలంటే లవంగాలు మరుగుతున్నప్పుడు అల్లం కూడా వేసుకోవచ్చు.
Photo: Pexels
విరాట్ కోహ్లీ రోజువారీ డైట్ రొటీన్ ఏముంటాయో తెలుసా?