వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ తాగండి చాలు

By Haritha Chappa
Mar 12, 2024

Hindustan Times
Telugu

వేసవిలో వేడి చేయకుండా ఉండాలంటే  రోజుకో గ్లాసు మజ్జిగ తాగితే ఎంతో మంచిది. శరీరానికి చలువ చేస్తుంది. 

ఇలా ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 అధికంగా లభిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ. 

 కండరాలు, చర్మం, ఎముకల ఆరోగ్యానికి మజ్జిగ మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 

 మజ్జిగను తాగడం వల్ల దాహం తీరడమే కాదు, డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. 

మజ్జిగలో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, జీరా పొడి వంటివి వేసుకుని కలుపుకుంటే మంచిది. 

అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా మజ్జిగ అడ్డుకుంటుంది. జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. 

అధికరక్తపోటుతో బాధపడే వారు ప్రతి రోజూ మజ్జిగ తాగడం చాలా అవసరం. మజ్జిగ బీపీని అదుపులో ఉంచుతుంది.

మజ్జిగలో ప్రొబయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పొట్టలో మంచి బ్యాక్టిరియాను కాపాడుతుంది. 

మైగ్రేన్ వచ్చే ముందు కనిపించే 7 లక్షణాలు ఇవే

Image Credits: Adobe Stock