తల్లి పాలు అమృతంతో సమానం. ప్రతి తల్లి తన బిడ్డకు కొన్ని సంవత్సరాల పాటు తల్లిపాలు ఇవ్వాలి.

Unsplash

By Anand Sai
May 14, 2024

Hindustan Times
Telugu

ఈరోజుల్లో పనికి వెళ్లే మహిళలు, అందంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే వారు బిడ్డకు పాలివ్వడం మానేస్తున్నారు. కానీ ఐసీఎంఆర్ ఈ విషయం గురించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

Unsplash

నవజాత శిశువుకు తల్లి పాలు పోషకాహారానికి మూలం. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలి.

Unsplash

బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు కాంప్లిమెంటరీ ఫుడ్స్ ఇవ్వాలి.

Unsplash

రెండేళ్ల వరకు ప్రతి బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఇతర ఆహారాలు ఇస్తే శిశువుకు జీర్ణం కావడం కొంచెం కష్టం.

Unsplash

కనీసం రెండేళ్లపాటు తల్లిపాలు తీసుకోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు బేబీలో కనిపిస్తాయి.

Unsplash

నవజాత శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లీ బిడ్డల బంధం బలపడుతుంది. తల్లి పాలలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

Unsplash

ఈ పాలలోని ఇమ్యునోగ్లోబిన్ IgA అంటు జీవులకు వ్యతిరేకంగా మంచి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

Unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels