వాకింగ్ చేస్తున్నారా?.. నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

Image Credits : Adobe Stock

By Sudarshan V
Jun 13, 2025

Hindustan Times
Telugu

నడక మీ రోజువారీ వర్కౌట్ లో భాగమా? బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి వాకింగ్ ఎంతో మంచిది. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆ బెనిఫిట్స్ పోతాయి.

Image Credits : Adobe Stock

వాకింగ్ చేసేముందు కాసేపు వామప్ ఎక్సర్ సైజ్ లు చేయండి. దానివల్ల మీ కండరాలు, కీళ్ళు నడకకు సిద్ధమవుతాయి.

Image Credits : Adobe Stock

వాకింగ్ చేస్తున్నప్పుడు మీ చేతులను బిగుతుగా, లేదా స్థిరంగా పెట్టకండి. మీ నడక వేగానికి మీ చేతుల కదలిక బ్యాలెన్సింగ్ గా ఉండాలి.

Image Credits : Adobe Stock

మీ శరీర అవసరాలకు అనుగుణంగా మీ నడక దూరాన్ని నిర్ణయించుకోండి. అధికంగా నడవడం వల్ల మోకాళ్ళు, తుంటిపై అదనపు ఒత్తిడి పడుతుంది.

Image Credits : Adobe Stock

నడుస్తున్న సమయంలో మెడ నిటారుగా ఉంచండి. స్ట్రైట్ గా చూస్తూ నడవండి. నిరంతరం కిందకు చూడటం మీ మెడ, భుజాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.

Image Credits : Adobe Stock

నడుస్తున్న సమయంలో వంగిపోవడం లేదా చాలా ముందుకు వాలడం వెన్నునొప్పికి కారణమవుతుంది. నడుస్తున్నప్పుడు మీ వీపును నిటారుగా, భుజాలను రిలాక్స్ గా ఉంచండి.

Image Credits : Adobe Stock

చాలా నెమ్మదిగా నడవడం మీ హృదయ స్పందన రేటును ఎక్కువగా పెంచదు. మీరు నడక యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీరు  చురుకైన వేగంతో నడవడానికి ప్రయత్నించండి.

Image Credits : Adobe Stock

చెమట రూపంలో నీరు శరీరం నుంచి వెళ్లిపోతుంది కనుక, డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండడానికి తగినంత నీరు తాగుతూ ఉండండి. 

Image Credits : Adobe Stock

నడుస్తున్నప్పుడు ఫోన్ చూసే అలవాటు మానుకోండి. నడక సమయంలో ఫోన్ చూడడం నడక లయ తప్పుతుంది.

Image Credits : Adobe Stock

సౌకర్యవంతమైన, నాణ్యమైన, సరైన కుషన్ ఉన్న షూస్ వాడండి.

Image Credits : Adobe Stock

అరకు టూర్ ప్యాకేజీ -  తక్కువ ధరలోనే వన్ డే ట్రిప్

image credit to unsplash