ఉదయం ఈ పనులు చేస్తే కిడ్నీలు త్వరగా పాడవ్వవు

pixabay

By Haritha Chappa
Jan 17, 2025

Hindustan Times
Telugu

శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వీటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతి రోజూ ఉదయమే కొన్ని పనులు చేయాలి.

pixabay

ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టతో ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎంతో మంచిది. కిడ్నీలు శుభ్రపడతాయి.

pixabay

ప్రతిరోజూ ఉదయం అరగంట పాటూ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే కిడ్నీలకు రక్తప్రసరణ పెరుగుతుంది, కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది.

pixabay

 అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినకూడదు.

pixabay

పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఆహారాలను బ్రేక్ ఫాస్టులో ఎంచుకోవాలి.

pixabay

కిడ్నీలో ఉన్న టాక్సిన్లు తొలగిపోవడానికి హెర్బల్ టీలు తాగితే మంచిది.

pixabay

రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో ఉదయాన్నే చెక్ చేసుకోవాలి. చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

pixabay

ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించుకోవాలి. లేకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం వంటివి ఉదయం పూట చేస్తూ ఉండాలి. 

pixabay

ఖాళీ పొట్టతో కాఫీని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కెఫీన్ కిడ్నీలపై  చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. 

pixabay

ఉదయాన్నే కాసేపు లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. 

pixabay

ఉప్పు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఉదయాన్నే ఉప్పు అధికంగా ఉండే ఆహారం తింటే కిడ్నీలు పాడవుతాయి.

pixabay

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash