మానసికంగా బలపడాలనుకుంటున్నారా? ఈ లక్షణాలను పెంపొందించుకోండి!

Pexel

By Ramya Sri Marka
Feb 18, 2025

Hindustan Times
Telugu

మానసిక సామర్థ్యం కలిగిన వ్యక్తులు భిన్నంగా కనిపిస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ అడ్డంకులను ఎదుర్కొనే స్థ్యైర్యం కలిగి ఉంటారు. మీరు కూడా మానసికంగా అదే విధంగా ఎదగాలనుకుంటున్నారా.. అయితే ఇవి ఫాలో అయిపోండి.

Pexel

మానసిక దృఢత్వం - మానసికంగా బలపడేందుకు ముందుగా మీకు కావాల్సింది భావోద్వేగ స్థిరత్వం. ప్రతి చిన్నదానికి చలించకుండా తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం అలవరచుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

pexel

సవాళ్లు స్వీకరించాలి - సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సవాళ్లను అవకాశంగా భావించండి. పట్టుదల ప్రదర్శించి ఇబ్బందులను ఎదుర్కోండి. ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని లక్ష్యం వైపు ప్రయాణించండి.

Pexel

ఓర్పు చాలా ముఖ్యం - మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే, ఓర్పు చాలా కీలకం. దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించాలంటే సహనం అవసరమని గ్రహించండి. నిబద్ధత, ఓపికతో పనిచేస్తేనే సుదూర లక్ష్యాలు చేరుకోగలం.

Pexel

మార్పును స్వీకరించండి - మీ చుట్టూ జరుగుతున్న మార్పులను స్వీకరించగలగాలి. మీకున్న సామర్థ్యాలకు మాత్రమే విలువనిచ్చి, బలహీనతలను విస్మరించాలి. 

Pexel

ఫెయిల్యూర్‌ను ఒప్పుకోగలగాలి - వైఫల్యాలకు బాధ్యత తీసుకోలేకపోతే మానసికంగా ఎదగలేరు. తప్పు చేశామని గ్రహించి ఓటమి ఒప్పుకోగలగాలి. అలాంటప్పుడే భవిష్యత్ ఎదురుదెబ్బలకు తట్టుకోగల సామర్థ్యం అలవడుతుంది. 

Pexel

క్రమశిక్షణ చాలా ముఖ్యం - పరిస్థితులు ఒత్తిడి కలిగిస్తున్నా, కష్టంగా అనిపించినా తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్నవారి నుంచి గౌరవం, నమ్మకం దక్కి ప్రేరణగా నిలుస్తాయి.

Pexel

రిలేషన్లు పెంచుకోండి - మానసిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది బంధాలను ఏర్పరచుకోవడం. వీలైనంత వరకూ పాజిటివ్ గా వ్యవహరిస్తూ బంధాలను ఏర్పరచుకోండి. మద్దతు, ఆనందం, సాంగత్యం అందించే సంబంధాలకు సమయం కేటాయించండి. 

Pexel

కృతజ్ఞత పాటించడం - అసూయ, అసంతృప్తి వంటి భావోద్వేగాలకు దూరం జరిగి కృతజ్ఞతాపూర్వకంగా మెలగండి. మీరు అందుకుంటున్న ప్రయోజనాల పట్ల కృతజ్ఞతగా వ్యవహరించడం వల్ల సానుకూల దృక్పథం అలవడుతుంది.

అభిప్రాయాన్ని కోరండి - మీరు తీసుకునే నిర్ణయాల గురించి మీ చుట్టూ ఉన్నవారి నుంచి అభిప్రాయాలను తీసుకోండి. వినడానికి ప్రాధాన్యతనివ్వడం వల్ల నిర్ణయంలో లోటుపాట్లను అర్థం చేసుకోగలుగుతారు. 

Pexel

ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఇలా చేయండి!