మీకు తీపి అంటే ఇష్టమా? సులభంగా తయారయ్యే గోధుమ లడ్డూ రెసిపీని తెలుసుకోండి!
Pinterest
By Ramya Sri Marka Feb 02, 2025
Hindustan Times Telugu
అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు లేదా మీకు తీపి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా సులభమైన గోధుమ లడ్డూ రెసిపీని ప్రయత్నించండి. కేవలం మూడు పదార్థాలతో రుచికరమైన లడ్డూ తయారు చేయవచ్చు.
Pinterest
గోధుమ లడ్డూ త్వరగా తయారవడమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Canva
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు, నెయ్యి - అర కప్పు,
బెల్లం - 2 కప్పులు.
Canva
తయారుచేసే విధానం
ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి, అందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి కాస్త వేడి అయ్యాక, గోధుమ పిండి వేసి బాగా కలపండి.
Pinterest
పిండి వేసిన తర్వాత అది వుండలు కట్టకుండా ఉండేందుకు బాగా కలపండి. ఇలా కలుపుతూ 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద పిండిని వేయించండి.
Canva
పిండి రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు దీన్ని అలాగే పక్కకు పెట్టి ఉంచి చల్లారిన తర్వాత దాంట్లో బెల్లం పొడి వేసి బాగా కలపండి.
Canva
బెల్లం పొడి, గోధుమ పిండి చక్కగా కలిసిన తర్వాత చేతికి కాస్త నూనె లేదా నెయ్యి అంటించుకుని ఈ పిండిని చిన్న చిన్న లడ్డూల లాగా తయారు చేయండి.
Canva
కాసేపటి తర్వాత ఉండలను ఒక ప్లేట్ లో అమర్చి అలంకరించండి. అంతే రుచికరమైన గోధుమ లడ్డూ తినడానికి సిద్ధం. ఒకసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా నచ్చుతుంది.
Canva
లైంగిక ఆరోగ్యం అనేది కూడా మీ మానసిక, శారీరక ఆరోగ్యంలాంటిదే. చాలా కాలంపాటు దానిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు