హిందూ ధర్మంలో అనేక సంప్రదాయాలు, నమ్మకాలు పాటిస్తారు.సాయంత్రం తర్వాత పూలు, ఆకులను కోయకూడదనే నమ్మకం చాలా మందిలో ఉంది.
ఇలా ఎందుకంటారు, దీని వెనకున్న రకరకాల కారణాలేంటో తెలుసుకుందాం రండి..
మొక్కలకు కూడా ప్రాణం ఉంది, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అవి విశ్రాంతి తీసుకుంటాయి, కాబట్టి వాటిని తాకకూడదనేది ఒక ధార్మిక నమ్మకం.
ఎవరైనా నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారికి ఇబ్బంది కలిగించకూడదు కదా. అదేవిధంగా పూలు, మొక్కలను కూడా సాయంత్రం తర్వాత తాకకూడదు అంటారు.
సాయంత్రం సమయంలో చెట్లు, మొక్కలలో కీటకాలు, పక్షులు నివసిస్తాయి, ఒకవేళ మనం వాటి విశ్రాంతికి భంగం కలిగిస్తే వాటిని మనం ఇబ్బంది పెట్టిన వారమవుతాం. ఇది మరో కారణం.
సాయంత్రం తర్వాత పూల సువాసన, అందం రెండూ తగ్గుతాయి. అందుకే పూజకు అర్పించే పూలను ఏ కారణం చేతనైనా సాయంత్రం తర్వాత కోయకూడదు, తాకకూడదు అంటారు.
సాయంత్రం తర్వాత పూలు, ఆకులను కోయకూడదు అనేందుకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
రాత్రి వేళ చెట్లు, మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి, కాబట్టి ఆ సమయంలో వాటిని తాకడం గానీ, చెట్టు కింద పడుకోవడం గానీ చేయకూడదు.
గమనిక: ఇది నమ్మకం, శాస్త్రం ఆధారంగా రాసిన కథనం. ఇందులోని అన్ని అంశాలను "హిందూస్తాన్ టైమ్స్ తెలుగు" ధృవీకరించదు. మీ స్వంత విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి.
ఒక్క లైన్తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్లు ఇవి..