ఆత్మీయులకే కాదు.. ఎవరికి కూడా ఇవ్వకూడని బహుమతుల జాబితా ఇది..
By Sudarshan V May 10, 2025
Hindustan Times Telugu
ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులకు బహుమతులు ఇచ్చే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది సంబంధాలలో ప్రేమ, నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
బహుమతుల ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తాం. కానీ కొన్నిసార్లు తెలిసో తెలియకో ప్రతికూల ప్రభావం చూపే వాటిని బహుమతులుగా ఇస్తుంటాం. ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం.
నలుపు రంగు వస్తువులు సాధారణంగా ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. కానీ ఈ రంగు బహుమతులు ఇవ్వడం మంచిదికాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరైనా ఆప్తులకు నల్లని దుస్తులు, గడియారాలు, బూట్లు వంటివి ఇవ్వకూడదు. దీంతో విబేధాలు పెరుగుతాయి.
చాాలామంది, ముఖ్యంగా లవర్స్ పెర్ఫ్యూమ్ లను గిఫ్ట్ గా ఇస్తుంటారు. అయితే పెర్ ఫ్యూమ్ ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
వాస్తు ప్రకారం పర్సును ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ముత్యాలు, ముత్యాల ఆభరణాలను ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.ఇవి కన్నీళ్లకు చిహ్నంగా భావిస్తారు, కాబట్టి ముత్యాలను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.
వాస్తు ప్రకారం, చేతి రుమాలు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిషశాస్త్రంలో దీనిని అశుభ శకునంగా భావిస్తారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుందని నమ్ముతారు.
నిరాకరణ: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.