ప్రస్తుత రోజుల్లో చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య భార్యభర్తలను ఎన్నోరకాలుగా ఒత్తిడికి గురిచేస్తుంది.
image credit to unsplash
సంతానలేమి సమస్యలకు వీర్య కణాల సంఖ్య తగ్గటం, ఆరోగ్యకరంగా లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు వంటివి కారణమవుతుంటాయి.
image credit to unsplash
సంతానలేమి సమస్యలను అధిగమించేందుకు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
సంతాన సమస్యలు ఉన్నవారు వారి డైట్ లో వాల్నట్స్ భాగం చేసుకోవాలి. క్రమంగా తీసుకోవటం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
image credit to unsplash
నువ్వుల్లో జింక్, కాల్షియం, సెలీనియం, ఐరన్, విటమిన్ బీ 6 తో పాటు పోషకాలు ఉంటాయి.నువ్వులను రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంగా కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
image credit to unsplash
గుమ్మడి గింజలు, బీన్స్, జీడిపప్పులను క్రమంగా తీసుకోవాలి.ఇందులో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల సంతాన సామర్థ్యం పెరుగుతుంది.
image credit to unsplash
పాలు, పాలపదార్థాలు సంతాన సమస్యలను దూరం చేస్తాయి. ఇందులోని విటమిన్లు హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి. ఖర్జూరతో పాటు సిట్రస్ పండ్లని తీసుకోవటం వల్ల సంతానలేమి సమస్యలు తొలిగే ఛాన్స్ ఉంటుంది.
image credit to unsplash
మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు