థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు తెలుసా..? ఈ 7 విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 23, 2025
Hindustan Times Telugu
క్యాన్సర్ లో అనేక రకాలుంటాయి. అయితే కొందరిలో థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు బయపడుతుంటాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే థైరాయిడ్ క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
image credit to unsplash
ఇది సాధారణంగా మెడ ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడుతుంది. దీన్నే థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. ముద్ద లేదా కణితి ఏర్పడటానికి దారితీస్తుంది.
image credit to unsplash
థైరాయిడ్ క్యాన్సర్ కొన్నిసార్లు బయటపడకపోవచ్చు. అయితే మెడలో గడ్డ, గొంతులో నొప్పి, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ద్వారా వీటిని గుర్తించవచ్చు.
image credit to unsplash
థైరాయిడ్ క్యాన్సర్ పురుషుల్లో కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా మహిళల్లో సంభవిస్తుందంట. కాబట్టి ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
image credit to unsplash
గొంతులో గడ్డలు, శోషరస గ్రంథుల్లో వాపు, మింగడంలో ఇబ్బంది, ఎడతెగని మెడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణమైన బరువు తగ్గటం, మెడలో బిగుతుగా అనిపించడం వంటివి థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలుగా ఉంటాయి.
image credit to unsplash
థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ గుర్తిస్తే సర్జరీ లేదా కీమో, రేడియేషన్ థెరపీలు చేయించుకోవాల్సి ఉంటుంది. స్థాయిని బట్టి వైద్యులను నిర్ణయిస్తారు.
image credit to unsplash
థైరాయిడ్ క్యాన్సర్‌ను సాధారణంగా రక్త పరీక్షలు లేదా సీటీ స్కాన్, ఎంఆర్ఐ ఇమేజింగ్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఇమేజింగ్ పరీక్షల ద్వారా...క్యాన్సర్ వ్యాప్తిని గుర్తిస్తారు.
image credit to unsplash
పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.