కిడ్నీలో రాళ్లను గుర్తించటం ఎలా..? వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Feb 14, 2025
Hindustan Times Telugu
కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. తరుచుగా నడుము పక్కన లేదా వెనుక భాగంలో నొప్పి వస్తుంటుంది.
image credit to unsplash
నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. లవణాలు, ఖనిజాలు, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరి కఠినమైన రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
image credit to unsplash
కిడ్నీలో కొన్ని స్టోన్స్ చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. అయితే కొన్ని లక్షణాల ద్వారా మన కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు ఓ అంచనాకు రావొచ్చు.
image credit to unsplash
పక్కటెముకల దగ్గర వీపు కింద నొప్పి పదే పదే వస్తుంటుంది. ఇలాంటి సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
image credit to unsplash
మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఎక్కువగా అనిపిస్తుంది. దీన్ని కూడా ఓ సంకేతకంగా భావించవచ్చు.
image credit to unsplash
మూత్రపిండల్లో రాళ్లు ఏర్పడి అవి కదులుతున్నప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండ వికారం, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
image credit to unsplash
మూత్రం చుక్కచుక్కలుగా వస్తున్నా లేక రంగు మారినా కిడ్నీ స్టోన్స్‌గా అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
image credit to unsplash
పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?