పాల కాఫీకి బదులుగా పసుపు కాఫీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Pixabay

By Ramya Sri Marka
Mar 17, 2025

Hindustan Times
Telugu

ఉదయాన్నే పాలు, చక్కెరతో తయారు చేసిన కాఫీకి బదులుగా పసుపుతో తయారు చేసిన కాఫీని డైలీ తాగి చూడండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. ఈ కాఫీ తాగడం వల్ల లభించే ప్రయోజనాలు అపారమైనవి. 

Pixabay

పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరమైనవి.

పరగడుపున పసుపు సేవనం పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని చెబుతారు.

Pixabay

పసుపులోని కుర్కుమిన్ మెదడులో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో మెరుగైన పాత్ర పోషిస్తుంది.

Pixabay

 పసుపులోని కుర్కుమిన్ యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఉదయాన్నే పసుపు కాఫీ తాగడం వల్ల నిరాశ, అలసట, ఆందోళన వంటివి తగ్గుతాయి. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. 

Pixabay

పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని పలు భాగాల్లో వచ్చే వాపు, నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలను నయం చేయడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది. 

Pixabay

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

Pixabay

పసుపు కాఫీ తయారు చేయడం కోసం ముందుగా నీటిని తీసుకుని బాగా మరిగించండి. తర్వాత ఈ నీటిని ఒక కప్పులో పోసి దాంట్లో కాఫీ పొడి, అరటీస్పూన్ పసుపు వేసి బాగా కలపండి. పసుపు కాఫీ తయారైనట్టే. 

Pixabay

ఈ పసుపు కాఫీలో ఎలాంటి తీపి పదార్థాలనూ ఉపయోగించడకూడదని గుర్తుంచుకోండి. ఈ కాఫీ తాగాలనుకునే వారు రుచి కోసం ఆలోచించకుండా ఆరోగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. 

Pixabay

రోజు శొంఠి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు వదలరు..

freepik