గుప్పెడు కరివేపాకులు ఉన్నాయా? చుండ్రును వెంటనే వదిలించేసుకోండిలా
By Haritha Chappa Apr 14, 2025
Hindustan Times Telugu
కరివేపాకును పురాతన కాలం నుండి జుట్టు ఆరోగ్యం, బలం కోసం ఉపయోగిస్తున్నారు. నూనెలో కరివేపాకులను వేసి తయారుచేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది కూడా.
విటమిన్ సి, బి వంటి పోషకాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకులు మన జుట్టును అందంగా చేస్తుంది. ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, నెత్తిమీద ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జుట్టు రాలడం, చుండ్రు లేదా ఇతర జుట్టు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.
ముఖ్యంగా చుండ్రుకు కరివేపాకు గ్రేట్ రెమెడీ. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చుండ్రును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
చుండ్రు పోవాలంటే కరివేపాకు, పెరుగుతో కరివేపాకు పేస్ట్ తయారు చేసి తలకు రుద్దుకోవచ్చు.
15 నుంచి 20 కరివేపాకు ఆకులను తీసుకుని బాగా కడిగి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. కనీసం గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయాలి.
కరివేపాకు, తేనె చుండ్రును వదిలించుకోవడానికి అద్భుతమైన ఔషధం. ఇందుకోసం కరివేపాకును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తయారు చేయండి. దాన్ని జుట్టుకు అప్లై చేయాలి.
కరివేపాకును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని తలకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఎఫెక్టివ్ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించండి.
బాణలిలో కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో పది నుంచి ఇరవై కరివేపాకు వేయాలి. తర్వాత బాగా వేడి చేయాలి. నూనె చల్లారిన తర్వాత తలకు పట్టించి మసాజ్ చేయాలి. 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గంటసేపు స్నానం చేయాలి. దీన్ని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు