వేసవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పండు పుచ్చకాయ. సులభంగా జీర్ణమయ్యే ఈ పండు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది.

Unsplash

By Anand Sai
Mar 09, 2025

Hindustan Times
Telugu

కొంతమంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచి తరువాత తింటారు. ఇలా నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Unsplash

పుచ్చకాయను కోసిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే దానిలోని కీలక పోషకాలైన లైకోపీన్, విటమిన్లు ఎ, సి తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

Unsplash

దానిని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే పండ్లలోని రసం కూడా మారుతుంది. దాని రుచి తగ్గుతుంది.

Unsplash

పుచ్చకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కోసిన వెంటనే తినడం శరీరానికి చాలా మంచిది.

Unsplash

కోసిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు ఈ తేమ బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

Unsplash

చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు తినకుండా ఉండటం మంచిది. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

Unsplash

ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయతో కొంతమందికి దగ్గు, జలుబు, గొంతు సమస్యలు రావచ్చు.

Unsplash

రుచి మాత్రమే కాదు.. మామిడి పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా..