ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు సరైన నిద్ర చాలా అవసరం. అయితే, కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నాణ్యమైన నిద్ర పట్టకపోయే అవకాశాలు ఉంటాయి. అలా నిద్రించేందుకు ముందు చేయకూడని పనులు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
రాత్రిపూట నిద్రించే ముందు ఆలస్యంగా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు. ఇలా చేస్తే నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. తినడానికి, నిద్రించేందుకు మధ్య కనీసం మూడు గంటల గ్యాప్ ఉండాలి.
Photo: Pexels
కఫీన్ ఉండే టీ, కాఫీలు రాత్రివేళ నిద్రించే ముందు తాగకూడదు. ఇవి శరీరంలో మెలటోనిన్ స్థాయిలను పెంచుతాయి. నిద్ర సరిగా రానివ్వవు.
Photo: Pexels
నిద్రపోయే ముందు స్క్రీన్‍టైమ్ ఎక్కువగా ఉండకూడదు. పడుకునే ముందు ఫోన్లు, ల్యాప్‍టాప్‍లు సహా బ్లూలైట్ ఉండే స్క్రీన్ లైట్లను ఎక్కువ సేపు చూడకూడదు. ఇలా చేస్తే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
Photo: Pexels
నిద్రించే ముందు తీవ్రమైన వ్యాయామాలు కూడా చేయకూడదు. మోస్తరుగా ఉండే లైట్ ఎక్సర్‌సైజ్‍లు చేయవచ్చు. కానీ పడుకునే ముందు తీవ్రంగా చేస్తే నిద్రకు ఇబ్బందిగా మారుతుంది.
Photo: Pexels
నిద్రించే ముందు ఆల్కహాల్ తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తరచూ మేలుకోవడంతో పాటు నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది. తర్వాతి రోజు పనులను కూడా పూర్తిస్థాయిలో చేయడం కష్టం కావొచ్చు.
Photo: Pexels
మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. సుమారు 50 రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. అయితే విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.