వీటిని ముఖానికి అసలు రాసుకోవద్దు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 02, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల పదార్థాలను ముఖానికి రాసుకోకూడదు. వీటిని ముఖం చర్మంపై రాస్తే సమస్యలు తలెత్తుతాయి. అలా, ముఖానికి రాసుకోకూడని 5 పదార్థాలు ఇవే. 

Photo: Pexels

బ్లాక్‍హెడ్స్ తగ్గుతాయంటూ ముఖానికి కొందరు టూత్‍పేస్ట్ రాస్తుంటారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ముఖం చర్మానికి టూత్‍పేస్ట్ పూసుకోకూడదు. టూత్‍పేస్ట్‌లోని బలమైన కెమికల్ పదార్థాలు చర్మంపై దురదలు, మచ్చలు, మంటకు కారణమవుతుంది. 

Photo: Pexels

బాడీలోషన్‍ను ముఖానికి రాయకూడదు. శరీర భాగాల కంటే ముఖంపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే బాడీ లోషన్ శరీరానికి సరిపోతుంది. బాడీ కోసం తయారు చేసిన దాన్ని ముఖానికి రాస్తే పగుళ్లు రావడం , పోర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది.

Photo: Pexels

పెట్రోలియం జెల్లీని కూడా ఎక్కువగా ముఖానికి రాసుకోకూడదు. ఇది వాడితే ముఖంపై మచ్చలు, పగుళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖానికి  లైట్‍వైట్ ఫేషియల్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 

Photo: Pexels

మేకప్ తీసేందుకు, మచ్చలు పోయేందుకు కొందరు ముఖానికి ఆల్కహాల్ రబ్ చేసుకుంటారు. అయితే, దీనివల్ల ముఖంపై దురద వస్తుంది. పగుళ్లకు కారణం కావొచ్చు. అందుకే ముఖానికి ఆల్కహాల్ రాయకూడదు. 

Photo: Pexels

హెయిర్ షాంపూలను ముఖానికి రాసుకోకూడదు. తల స్నానం చేసే సమయంలో షాంపూ నురగ ముఖంపై పడితే వెంటనే క్లీన్ చేసుకోవాలి. షాంపూ వెంట్రుకలకు మేలు చేసినా.. చర్మానికి అంత మంచిది కాదు. దురద, మంట లాంటి సమస్యలు రావొచ్చు.

Photo: Pexels

చలికాలంలో గోరువెచ్చటి నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash