రోజుకో క్యారెట్‌ తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

రోజుకో క్యారెట్‌ తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

By Bolleddu Sarath Chandra
Jan 06, 2025

Hindustan Times
Telugu

పోషకాల పరంగా చూస్తే కూరగాయల్లోకెల్లా అత్యధికంగా విటమిన్ ఎ క్యారెట్‌లో లభిస్తుంది. 

రోజుకో  పెద్ద క్యారెట్ లేదా గ్లాసుడు క్యారెట్ జ్యూస్‌ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి

విటమిన్‌  "ఎ" కు సంబంధించిన కెరోటిన్‌ పదం   క్యారెట్‌ నుంచి వచ్చింది. తినే ఆహారంలో కెరోటిన్‌‌ను కాలేయం విటమిన్‌‌ ఎకు మారుస్తుంది. 

తరచుగా క్యారెట్‌ తినేవారిలో లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. 

క్యారెట్లు ఎక్కువగా ఆహారంలో తీసుకునే వారిలో  మూత్రాశయ క్యాన్సర్‌, సర్విక్స్‌ క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 50శాతం తక్కువగా ఉంటాయి. 

రోజుకు 200 గ్రాముల పచ్చి క్యారెట్లను  3వారాల పాటు తింటే బ్లడ్ కొలెస్టారాల్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టు  పరిశోధనలు చెబుతున్నాయి. 

క్యారెట్లు  తినేవారిలోListeria ఫుడ్‌ పాయిజినింగ్‌ కలిగించే సూక్ష్మ జీవులు  తగ్గిపోతాయి. 

ప్రతి 100 గ్రాముల క్యారెట్‌లో  తేమ 86శాతం, ప్రొటీన్లు 0.9శతం, కొవ్వు 0.2గ్రాములు, ఖనిజ లవణాలు  1.1 గ్రాములు, ఫైబర్ 1.2 గ్రాములు,  కార్బో హైడ్రేట్‌లు 10.6 గ్రాములు, శక్తి 48 క్యాలరీలు లభిస్తాయి. 

క్యారెట్లలో  మెగ్నిషియం, సోడియం, పొటాషియం, కాపర్, మాంగనీస్‌, జింక్‌, క్రోమియం, సెలెనియం ఉంటాయి. 

క్యారెట్లలో కాల్షియం, పొటాషియం, ఐరన్‌, థయమిన్‌, రైబో ఫ్లోవిన్‌, నియానిస్‌, విటమిన్ సి ఉంటాయి. 

ఆరోగ్య సంరక్షణ కోసం రోజుకో క్యారెట్‌  అద్భుత ఫలితాలను అందిస్తుంది. 

మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 

pexel