వాకింగ్‌ను క్రమం తప్పకుండా చేయడానికి సింపుల్ టిప్స్

pexel

By Ramya Sri Marka
Jan 05, 2025

Hindustan Times
Telugu

నడక అనేది తక్కువ ప్రభావంతో చేసే మంచి వ్యాయామం. బరువు తగ్గడానికి, హృదయ ఆరోగ్యం పెంచడానికి, కండరాలను బలోపేతానికి సహాయపడుతుంది.

pexel

ప్రతి రోజూ 20 నిమిషాల పాటు నడిస్తే మానసిక అప్రమత్తత, శక్తి, ఆత్మగౌరవం పెరుగుతాయి.

pexel

వారానికి ఒకసారి లక్ష్యాలను పెంచుకుంటూ ఎక్కువ కిలోమీటర్లు నడవాలని లక్ష్యాలను పెట్టుకోండి. అది ప్రేరణ కల్పిస్తుంది.

pexel

వర్క్ నుండి ఇంటికి చేరుకోవాలనుకుంటున్నప్పుడు బస్సు లేదా ట్రైన్ నుంచి ఒక స్టాప్ ముందే దిగిపోండి. అలా దిగడం ద్వారా మరిన్ని అడుగులు వేయడానికి దోహదపడుతుంది.

pexel

రోజూ ఒకే దారిలో నడవాలని కాకుండా కొత్త దారులలో నడిచేందుకు ఆసక్తి కనబరచండి. దీని వల్ల బాధలు దూరమై మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

pexel

 రోజూ నడకకు వెళ్లే పనిని వాయిదా వేయకుండా ఉండటానికి ఒక స్నేహితుడు లేదా సహచరుడితో కలిసి నడించేందుకు ప్లాన్ చేసుకోండి. ఇది మీకు ప్రేరణ పెంచుతుంది.

pexel

 నడకకు సరైన పాదరక్షలు, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

pexel

 మీరు నడకకు కొత్త అయితే, ప్రారంభంలో చిన్న దూరాలతో ప్రారంభించి, మరింత స్థిరంగా తయారయ్యే వరకు క్రమంగా అడుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లండి.

pexel

 క్యాల్షియం తక్కువగా ఉందా..? అయితే రాగులు తీసుకోవాల్సిందే

image credit to unsplash