శరీరంలో గుండె, కాలేయం, ఊపిరితిత్తుల మాదిరి చర్మం కూడా ఒక అవయవమే..
శరీరం మీద చర్మం వైశాల్యం 25చదరపు అడుగులు ఉంటుంది. ప్రతి గంటకు ఆరు లక్షల చర్మ కణాలు విసర్జనకు గురవుతాయి.
ప్రతి చదరపు అంగుళం చర్మంలో 645 స్వేద గ్రంథులు, 196 అడుగుల రక్త నాళాలు, 77 అడుగుల నాడులు ఉంటాయి.
మనిషి జీవిత కాలంలో సగటున 180కిలోల చర్మకణాలు శరీరం నుంచి రాలిపోతాయి.
చర్మంలో ప్రతి 50 రోజులకు ఓసారి కణాలు రాలిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి.
చర్మంలో ఫైబ్రో బ్లాస్ట్‌లు, కెరిటినో సైట్స్ అనే రెండు రకాల చర్మ కణాలు ఉంటాయి.
ఆరున్నర అంగుళాల చదరపు వైశాల్యం ఉండే చర్మంలో అనేక సూక్ష్మ రక్తనాళాలు, 65 వెంట్రుకలు, 100కు పైగా నూనె గ్రంథులు, 650 స్వేద గ్రంథులు, లెక్క లేనన్ని నాడులు ఉంటాయి.
చర్మం రెండు పొరలతో నిర్మించి ఉంటుంది. చర్మం పై భాగాన్ని ఎపిడెర్మిస్ అంటారు. లోపలి భాగాన్ని డెర్మిస్ అంటారు.
మన కంటికి కనిపించే చర్మం ఉపరితలం మాత్రమే. శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కోరకమైన చర్మం ఉన్నా, అధిక భాగంలో ఒకే రకమైన మందంతో ఉంటుంది.
కంటి రెప్పల మీద ఉండే చర్మం అతి పల్చగాను, అరికాలు, అరిచేతుల్లో చర్మం మందంగా ఉంటుంది.
శరీరం మొత్తాన్నీ కప్పుతూ, లోపలి అవయవాలను నిర్ణీత స్థానాల్లో ఉంచి, ఒత్తిడి నుంచి, బాహ్య ప్రమాదాల నుంచి దేహాన్ని కాపాడుతుంది.
శరీర ఉష్ణోగ్రతను నిర్ణీత స్థానంలో ఉంచేలా చర్మం పనిచేస్తుంది.
చర్మం సాధారణంగా ముడుచుకుపోయే గుణంతో ఉంటుంది. శరీరానికి ఆకృతి ఇస్తుంది. హానికరమైన క్రిముల నుంచి రక్షణ కల్పిస్తుంది. స్పర్శ జ్ఞానం కలిగి ఉంటుంది.
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?