సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా ఈ 7 పనులు అస్సలు చేయకండి!

By Sanjiv Kumar
Jan 09, 2025

Hindustan Times
Telugu

హిందూ ధర్మంలో మకర సంక్రాంతి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల వేయి రెట్లు పుణ్యం లభిస్తుంది.

అలాంటప్పుడు మకర సంక్రాంతి రోజున ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ రోజున ఎలాంటి చెట్లనూ నరకకూడదు. చెడు మాటలు లేదా ఎవరినీ బాధపెట్టే విధంగా మాట్లాడకూడదు.

మకర సంక్రాంతి పుణ్యకాలంలో జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు.

తాంసిక ఆహార పదార్థాలు అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, వంకాయలు, పనసకాయ లేదా మసాలా ఆహారాలు తినకూడదు.

ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకూడదు. ఆవు లేదా గేదె పాలు పితకకూడదు.

మకర సంక్రాంతి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే, దేవతలను అవమానించకూడదు.

నోట్: ఈ సమాచారం కేవలం మత విశ్వాసాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దానికి ఎలాంటి హామీ ఇవ్వదని గుర్తించగలరు.

ప‌చ్చి బొప్పాయి తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash