డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి సరైనా ఆహారం చాలా కీలకం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లు సహజంగా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Oct 05, 2024
Hindustan Times Telugu
గుమ్మడికాయ జ్యూస్ - గుమ్మడికాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. డెంగ్యూ రికవరీ సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
pexels
బచ్చలికూర, కాలే జ్యూస్ - స్పినాచ్, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్ ఉత్పత్తిని పోత్సహిస్తుంది. డెంగ్యూ సమయంలో కోలుకోవడానికి సహాయపడుతుంది.
pexels
బీట్ రూట్, అల్లం, పుదీనా రసం - బీట్ రూట్ ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అల్లం, పుదీనా రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకి మద్దతు ఇస్తుంది. ప్లేట్ లెట్ పునరుత్పత్తికి సహాయపడుతుంది.
pexels
దానిమ్మ జ్యూస్ - దానిమ్మలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లేట్ లెట్ కౌంట్ ను మెరుగుపరచడమే కాకుండా, డెంగ్యూ వల్ల కలిగే ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
తమలపాకు జ్యూస్ - తమలపాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ప్లేట్ లెట్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఈ జ్యూస్ లో ఉసిరి లేదా అల్లం కలిపితే అదనపు యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది.
pexels
అలోవెరా జ్యూస్ - అలోవెరా శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. డెంగ్యూ సమయంలో ప్లేట్ లెట్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది.
pexels
బొప్పాయి ఆకు రసం - బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్ కౌంట్ ను గణనీయంగా పెంచుతుంది. నీరసం, బలహీనత వంటి డెంగ్యూ లక్షణాలను తగ్గిస్తుంది.
pexels
ఆరెంజ్ జ్యూస్ - విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ప్లేట్ లెట్ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
pexels
వీట్ గ్రాస్ జ్యూస్ - గోధుమ గడ్డి క్లోరోఫిల్, విటమిన్లకు గొప్ప మూలం. ఇది ప్లేట్ లెట్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.
pexels
హనుమంతుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే