దిల్లీలోని ఓ రెస్టారెండ్ లో మౌత్ ఫ్రెషనర్ బదులుగా డ్రై ఐస్ ఇవ్వడంతో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రెస్టారెంట్లలో డ్రై ఐస్ ఎందుకు వాడతారు. అసలు డ్రై ఐస్ అంటే ఏంటో, ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Mar 06, 2024
Hindustan Times Telugu
ఆహారాన్ని ఫోటోజెనిక్, ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కోసం రెస్టారెంట్లలో డ్రై ఐస్ ఉపయోగిస్తారు. దిల్లీలోని ఓ రెస్టారెంట్ కూడా ఫుడ్ ను ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు డ్రై ఐస్ పెట్టింది. దీని గురించి తెలియక తిన్న 5 గురు కస్టమర్లు తీవ్ర అస్వసత్థతకు గురయ్యారు.
pexels
ఇటీవల ఇంట్లో చాలా అరుదుగా బయట చాలా తరచుగా భోజనాలు చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్‌లు ప్రజలను ఆకర్షించడానికి ఆహారాన్ని ఫోటోజెనిక్‌గా మార్చడానికి కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నాయి. వీటిల్లో డ్రై ఐస్‌ని ఉపయోగించడం ఒకటి. ఆహారం, పానీయాల నుంచి తెల్లటి పొగ వచ్చేలా చేసేందుకు డ్రై ఐస్ ను ఆహారం చుట్టూ వేస్తారు.
pexels
డ్రై ఐస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కార్బన్ డయాక్సైడ్ ను సుమారు -78.5°C (-109.3°F) ఉష్ణోగ్రత వద్ద ఘనీభవించినప్పుడు డ్రై ఐస్ ఏర్పడుతుంది. దీనిని గది ఉష్ణోగ్రత వద్ద పెట్టినప్పుడు డ్రై ఐస్ వాయువుగా మారుతుంది. తెల్లటి దట్టమైన పొగలా వ్యాపిస్తుంది.
pexels
డ్రై ఐస్ నోటి లోపలికి వెళితే నాలుక, అంతర్గత అవయవాలను కాల్చేస్తుంది. దట్టమైన వాయువు జీర్ణవ్యవస్థలో చేరితే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, వాంతులు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో వైద్య సహాయం అత్యవసరం.
pexels
డ్రై ఐస్ శీతలీకరణ ఏజెంట్.. సాధారణంగా షిప్పింగ్ సమయంలో వస్తువులను చెడిపోకుండా ఉండడానికి, ఆహారం లేదా వస్తువులకు స్పెషల్ ఎఫెక్ట్ లో చూపించడానికి ఉపయోగిస్తారు.
pexels
డ్రై ఐస్ ను సరిగ్గా ఉపయోగించకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీనిని నేరుగా తాకడం వల్ల చేతులు కాలిపోతాయి. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద డ్రై ఐస్ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తులకు హాని చేస్తాయి.
pexels
డ్రై ఐస్ తింటే ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఘన కార్బన్ డయాక్సైడ్, ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది.
pexels
శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి