డీప్ సీక్: డీప్ సీక్ అంటే ఏమిటి? చైనా ఏఐ మోడల్ గురించి తెలుసుకోండి

Photo Credit: Flickr

By Sudarshan V
Jan 30, 2025

Hindustan Times
Telugu

చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్ స్పీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను ప్రవేశపెట్టి సిలికాన్ వ్యాలీకి షాక్ ఇచ్చింది.

Photo Credit: Unsplash

దీప్ సీక్ ఏఐ మోడళ్లు ఇప్పుడు ప్రపంచంలోని ఉత్తమ ఏఐ మోడళ్లను అధిగమించాయి.

Photo Credit: Unsplash

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్స్ రంగంలో స్పెషలైజేషన్ కలిగిన ఇంజనీర్, పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో డీప్ సీక్ ను స్థాపించారు.

Photo Credit: Flickr

డీప్ సీక్ సృష్టించడానికి ముందు, లియాంగ్ ఆర్థిక డేటాను విశ్లేషించడానికి AIని ఉపయోగించే హెడ్జ్ ఫండ్ కు నాయకత్వం వహించాడు.

Photo Credit: Unsplash

లియాంగ్ బృందం ప్రముఖ చైనీస్ విశ్వవిద్యాలయం నుండి కొత్త ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లను నియమించింది. కంపెనీ కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తుంది.

Photo Credit: Unsplash

డీప్ సీక్ ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. ఓపెన్ మోడల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు దీన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

Photo Credit: Flickr

అకస్మాత్తుగా ఖ్యాతి గడించిన డీప్ సీక్ ను ఇప్పుడు ఏఐ అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఓపెన్ ఏఐతో పోలుస్తున్నారు.

Photo Credit: File Photo

దీని పనితీరును ఓపెన్ ఏఐ  తాజా సాంకేతికతతో పోల్చవచ్చని డీప్ సీక్ పేర్కొంది. తద్వారా డీప్ సీక్ ఏఐ పరిశ్రమలో పెనుమార్పులు తీసుకురానుందని భావిస్తున్నారు.

Photo Credit: Unsplash

బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay