దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దసరా సమయంలో ఇళ్లు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కొలుగోలు చేస్తుంటారు. అయితే నవరాత్రుల్లో ఏ రోజున కొత్త వాటిని కొనుగోలు చేయాలో, జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Oct 08, 2024
Hindustan Times Telugu
ఏడాదిలో నవరాత్రులు ఐదు సార్లు వస్తాయి. వీటిలో ముఖ్యమైన శరన్నవరాత్రులు అక్టోబర్, నవంబర్ నెలలో జరుపుకుంటాం. 9 రోజుల పాటు దుర్గదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది.
pexels
దసరా తొమ్మిది రోజుల్లో ఎక్కువ మంది ఇల్లు, భూమి, వాహనాలు, కొత్త వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నవరాత్రుల్లో కొత్త పనులు ప్రారంభించడం శుభమని భావిస్తారు.
twitter
అక్టోబర్ 3 నుంచి దసర శరన్నవరాత్రులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దసరా 9 రోజుల్లో ప్రతి తిథి నాడు ఒక్కో దేవతను పూజించడం ఎంతో శుభమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
pexels
నవరాత్రుల్లో ఇల్లు, భూమి, వాహనం లేదా కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవరాత్రుల చివరి రోజైన విజయదశమిని అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. అయితే ఈ ఏడాది విజయదశమికి కొత్త పనులు వద్దంటున్నారు.
pexels
శరన్నవరాత్రుల్లో అన్ని రోజులు శుభప్రదమైనవేనని జ్యోతిష్కులు చెబుతున్నారు. నవరాత్రుల్లో పంచమి తిథి నుంచి శుభదినం ప్రారంభం అవుతుందంటున్నారు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు కొత్త పనులు ప్రారంభించవచ్చనని, భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.
pexels
పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి...ఈ నాలుగు రోజుల్లో సప్తమి నాడు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున దుర్గామాత భూమిపై నివశిస్తుందని భక్తులు నమ్ముతారు.
pexels
దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దసరా సమయంలో ఇళ్లు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కొలుగోలు చేస్తుంటారు. అయితే నవరాత్రుల్లో ఏ రోజున కొత్త వాటిని కొనుగోలు చేయాలో, జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
pexels
నెయ్యిని ఎందుకు వాడాలో తెలుసా..! ఈ 6 కారణాలు తెలుసుకోండి