బరువు తగ్గేందుకు ఈ జ్యూస్.. ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 21, 2025
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస, అల్లంతో చేసే జ్యూస్ ఎంతో తోడ్పడుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో.. ఉపయోగాలు ఏంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఈ జ్యూస్ చేసుకునేందుకు.. ఓ మోస్తరు సైజ్ ఉండే ఓ కీరదోస, ఓ ఇంచ్ అల్లం, ఓ గ్లాసు నీరు, కాస్త నిమ్మరసం అవసరం అవుతాయి.
Photo: Pixabay
కీరదోస తొక్కను తీసి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇష్టమైతే తొక్కను అలాగే ఉంచి ముక్కలుగా చేసుకోవచ్చు. అల్లం సన్నగా తరుక్కోవాలి.
Photo: Pexels
ఆ తర్వాత ఓ మిక్సీ జార్‌లో కీరదోస, అల్లం ముక్కలు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అప్పుడు నీరు పోసి మరింత బ్లెండ్ చేసుకోవాలి.
Photo: Pexels
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టాక పిప్పిని తీసేసి కిందికి దిగిన జ్యూస్ తాగేయాలి. కావాలంటే అందులో రుచికి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోవాలి.
Photo: Pexels
కీరదోస అల్లం జ్యూస్ తాగడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. దీంతో ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ జ్యూస్ వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దీంతో బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
కీరదోస అల్లం జ్యూస్ శరీరానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఆహారం ఎక్కువగా తినకుండా ఈ జ్యూస్ చేయగలదు. వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడుతుంది.