కొత్తిమీర శతాబ్దాలుగా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తున్న ఆకుకూర. తాజా కొత్తిమీర ఆకులు వంటకాలకు రుచిని జోడిస్తాయి. ధనియాలను నానబెట్టి ఆ నీటిని తాగితే కలిగే 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
pexels
By Bandaru Satyaprasad Feb 04, 2025
Hindustan Times Telugu
జీర్ణక్రియకు ఉత్తమం- ధనియాలలో ఫైబర్, ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
pexels
చక్కెర స్థాయిని తగ్గిస్తుంది - కొత్తిమీర గింజలలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ధనియాల నీరు తాగితే డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
pexels
బరువు తగ్గడంలో-ధనియాల నీరు శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని తగ్గించి, అతిగా తినడాన్ని నివారిస్తుంది.
pexels
మెరిసే చర్మం - నానబెట్టిన కొత్తిమీర గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మం డీటాక్సిఫికేషన్ కు సహాయపడుతుంది. కొత్తమీరలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.
pexels
గుండె ఆరోగ్యం - ధనియాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. అథెరోస్ల్కెరోసిస్, రక్తపోటు వంటి గుండె జబ్బులను నివారించడానికి సాయపడుతుంది.
pexels
రోగ నిరోధక శక్తి - కొత్తిమీర విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారిన పడకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ధనియాల నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.
pexels
డీటాక్సిఫికేషన్ - నానబెట్టిన ధనియాల నీరు శరీరంలోని వ్యర్థాలు ముఖ్యంగా సీసం, పాదరసం వంటి భారీ లోహాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధనియాల నీరు ఉపయోగపడుతుంది.
pexels
రాత్రి సమయంలో గుప్పెడు ధనియాలు గ్లాస్ నీటిలో నానబెట్టి, ఆ నీటిని పరగడుపునే తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
pexels
టీ తాగితే శరీరానికి మేలు కలుగుతుందా, హాని జరుగుతుందా... టీ తాగడంపై భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి...