జుట్టును మెరుగ్గా ఉంచే కాపర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఇవి
By Chatakonda Krishna Prakash Jan 18, 2025
Hindustan Times Telugu
జుట్టు ఆరోగ్యానికి మనం తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. వెంట్రుకల కోసం కొన్ని పోషకాలు ఉండే ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. జుట్టు పెరుగుదలకు, మెరుగ్గా ఉండేందుకు కాపర్ చాలా ముఖ్యం. కాపర్ పుష్కలంగా ఉండే ఆరు ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పాలకూర, కేల్, బచ్చలి లాంటి ఆకుకూరల్లో కాపర్ మెండుగా ఉంటుంది. కీలకమైన విటమిన్స్, మినరల్స్ కూడా వీటిలో పుష్కలం. అందుకే ఈ ఆకుకూరలు తింటే జుట్టుకు మేలు చేస్తాయి.
Photo: Pexels
పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆక్రోటు, బాదం, జీడిపప్పు లాంటి సీడ్స్, నట్స్ తినడం వల్ల శరీరంలో కాపర్ స్థాయి పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు ఇవి ఉపకరిస్తాయి.
Photo: Pexels
శనగలు, పప్పులు, కిడ్నీ బీన్స్ లాంటి కాయధాన్యాల్లో కాపర్ మెండుగా ఉంటుంది. ఇవి జుట్టు మెరుగ్గా ఉండేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ప్రొటీన్ కూడా పుష్కలం.
Photo: Freepik
పుట్టగొడుగుల్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు బలంగా ఉండేందుకు, మెరుగ్గా పెరిగేందుకు ఇవి తోడ్పడతాయి.
Photo: Pexels
క్వినోవా, బార్లీ, ఓట్స్ లాంటి చిరుధాన్యాలు తినడం వల్ల శరీరంలో కాపర్ స్థాయి పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఈ ధాన్యాలు మేలు చేస్తాయి.
Photo: Pexels
డార్క్ చాక్లెట్‍లోనూ కాపర్ ఎక్కువే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. జుట్టు మెరుగ్గా ఉండేందుకు డార్క్ చాక్లెట్ తినడం ఉపకరిస్తుంది.
Photo: Pexels
గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.