గోంగూరులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Unsplash
By Anand Sai Aug 13, 2024
Hindustan Times Telugu
గోంగూర ఆకులను తీసుకుని వాటిపై కొంచెం పటిక నూనె రాసి, వేడి చేసి, వాపు, వివిధ రకాల నొప్పి ఉన్నచోట ఆకులను ఉంచండి. ఇది నొప్పి, వాపును తక్షణమే తగ్గిస్తుంది.
Unsplash
గోంగూరలో విటమిన్ సితో పాటు విటమిన్ ఎ, బి1, బి2, బి9 కూడా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మరియు అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.
Unsplash
ఇందులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి.
Unsplash
ఈ పచ్చి ఆకు రసాన్ని తీసి వడకట్టి అందులో అరకప్పు పాలు కలుపుకుని ఉదయం, సాయంత్రం రెండుసార్లు తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
Unsplash
అన్నంలో కొద్దిగా గోంగుర పచ్చడి కలుపుకొని తింటే విరేచనాలు అరికట్టవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సాయపడుతుంది.
Unsplash
జీర్ణశక్తిని పెంచడంలో ఈ ఆకుకూర ఎంతగానో సహకరిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు దానితో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
Unsplash
ఈ ఆకులను పేస్ట్ చేసి తలకు పట్టించి కొంత సమయం తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది.